28, మార్చి 2011, సోమవారం

రగులుతున్న రాష్ట్రం!!!!

ఎందుకోసం ఈ విద్వేషాలు!?
ఎవరికోసం ఈ కోపతాపాలు..?

ఒకరి ఉద్యమం నిజమైతే..
మరొకటి అబద్దమవుతుందా!?
ఒక విద్యార్థి విప్లవకారుడైతే..
మరొకడు తీవ్రవాదా!?

అభివృద్దికి ఆటంకం ప్రజలా..
నిన్ను దోచిన నాయకులా!?

ఇన్నినాళ్ళూ ఏం జేస్తున్నడు
సిగ్గులేని నాయకుడు..

మతం,కులం,ప్రాంతమని
జనాన్ని విడదీస్తున్నడు..

రగులుతున్న రాష్ట్రం చూసి
సంబరపడిపోతున్నడు..

1 కామెంట్‌:

shayi చెప్పారు...

బాబూ చైతన్యా!
నీ అమాయకత్వానికి నవ్వొస్తోంది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రా అభివృద్ధికి ఆటంకం తమిళ ప్రజలా? అప్పుడు ఆంధ్రా ప్రజలను దోచిన మీ ఎమ్మెల్యేలు .. మంత్రులా ..?
స్వాతంత్ర్యానికి పూర్వం నుండి 1953 వరకు ఉన్న మీ మంత్రులు, సిగ్గు లేని నాయకులు ఏం జేసారు? ది గ్రేట్ ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడే? ఏం చేసాడు? అప్పటి మీ మహానాయకులు భాష, ప్రాంతం అంటూ జనాలను విడదీసారు. పొట్టి శ్రీరాములు దీక్ష, మరణం అప్పుడు ఆనాటి రాష్ట్రాన్ని రగిలిపోయేలా చేయలేదా? దాంతో దేశం మొత్తం భాషోద్యమాలు చెలరేగి అట్టుడికిస్తుంటే మనకు లభించిన స్వాతంత్ర్యమే నిలుస్తుందా అని విదేశాలు ఆసక్తిగ చూసే పరిస్థితులు దాపురించలేదా? ఫలితంగా దేశం మొత్తానికే ఎస్సార్సీ వేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? ఇప్పుడు మీరేం ధర్మ పన్నాలు వల్లిస్తున్నారో ఆనాటి తమిళ నాయకులు అప్పుడు అవే మాటలు మాట్లాడలేదా? పోనీ .. అప్పుడు మీరు కోరుకొన్న ఆంధ్ర రాష్ట్రానికి కనీసం వయబిలిటి ఉండిందా? మూడేళ్ళలోనే చతికిలబడి, హైదరాబాదు పై కళ్ళు పడి, మా మీద వచ్చి పడలేదా? దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే!
నువ్వు నిప్పు కోడిలా తలను భూమిలో కప్పెట్టుకొంటే, చరిత్ర నీకు కనిపించక పోవచ్చు .. కాని, అది చెరిగిపోదుగా!
ఇంకా యువకునిలాగే ఉన్నావు. అప్పుడే మీ స్వార్థ రాజకీయుల మాయలో పడకు. కొంచెం చరిత్రను అధ్యయనం చేసి, స్వంతంగా ఆలోచించడం నేర్చుకో.