22, మార్చి 2011, మంగళవారం

అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే ఈ కరాళ నృత్యం ఇంకా ఎన్నల్లు

రగులుతున్న ఆంధ్రావని ఎందరో త్యాగధనుల పుణ్యభూమి
నేడు రాజకీయాలకు బలై ఖండమై పోయింది
ముక్కలు చెక్కలై కుక్కలు చింపిన విస్తరిలా మారబోతుంది
అన్నదమ్ములు దాయాదులై తల్లిని పంచుకుంటారా
ఏది తెలంగానం ఏది ఆంధ్రరాజ్యం ఏది సీమరత్నం
కులాల చిచ్చు నేడు భాషకు కూడా పాకిందా..
పూర్ణ భోజనాన్ని చేతులారా కుక్కలపాలు చేస్తారా.
స్వార్థ రాజకీయాల కుతంత్ర యుక్తులకు బలై
వెర్రి ఆవేశాన్ని నింపుకొని సాగించే ఈ దహనకాండ
మారణ హోమం ఎవరి తృప్తి కోసం , ఎవరి మనుగడ కోసం
అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే
ఈ కరాళ నృత్యం, పైశాచిక ఆనందం, అఖండ భారతావని
భాషా చరిత్రలో మరో నికృష్ట అధ్యాయం .
సర్వ మానవాళి సిగ్గుతో తలవొంచుకునే దుర్దినం.
ఎవరి స్వార్థం కోసం ఈ అభినవ పద్మవ్యూహం
ఎందరో ఆభిమన్యులు కలి తంత్రాలకు బలై,
సొంత సోదరుల చేతిలో పతనమయ్యే ఈ
అభినవ భారత మహా సంగ్రామం, భాషా సంగ్రామం
ఆగేదేపుడు..దీనికి అంతమెపుడు..పగసేగలు చల్లారేదెపుడు

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Where are the statues of the "telangana velugulu" in seemandhra? Where were you when our people died because of andha politics?