3, ఏప్రిల్ 2011, ఆదివారం

వాస్తవం మరుగున పడిపోతుంది..నిజం నిష్టూరం అవుతుంది

కొన్ని నిజాలు అబద్దాలుగాఎందుకు మారతాయి..
వాస్తవం మరుగున పడిపోతుంది..నిజం నిష్టూరం అవుతుంది
ఎందుకు అని ఆలోచించే లోపు అన్నీ జరిగిపోతాయి..
మనసు, మమతలు ఒక్కోసారిగా మరుగున పడిపోతాయి కారణం లేకుండా..
పాత కొత్తగా మారుతుంది కొత్త..గాళ్ళో కొట్టుకు పోతుంది..
మంచి చేద్దామనుకుంటే ..ఆ మంచే పెద్ద నేరంగా మారిపోతుంది..
అదే మనిషిని రగిలించేంతగా..రక్షించుకోలేనంతగా భాదగా
ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించుకునే లోపు అన్ని అవకాశాలు పోతాయి..
చేజారిన ఆ అవకాశాలు ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాళ్ళా మినుగు మిగుమంటాయి...
అలా ఆ నక్షత్రాల వైపు దీనంగా వేదనగా చూడటమే తప్ప ఏమీచేయలేం మరి..
ఎప్పుడో విన్నా విధి ఆడుతున్న నాటకం అంటారు ఇదేనేమో కదా..?..
ఇలాటి పరిస్తితుల్లోనే మనిషి లోంచి మనసు వేరు అవుతుంది ..
జ్ఞాపకాలు వేదింపులకు మనస్సు తట్టుకోలేకపోతుంది..
గుర్తులు గుండేళ్ళో గునపాళ్ళా దిగి భాదపెడుతుంటాయి..
ఇలా ప్రతి క్షనం గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు గుండేల్లో వేదనను భాదను మిగులుస్తాయి..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఎటెల్లిపోయావు బాబూ!

గుసగుస

‘నా జీవితం తెరిచిన పుస్తకం..’, ‘పారదర్శకత’ అంటూ తెగ డైలాగులు చెబుతుంటారు చాలా మంది నేతలు. వారిలో చాలా మంది పుస్తకాల్లో కనిపించని ‘నల్ల’ పేజీలు చాలానే ఉంటాయి. ఇటువంటి వారిలో అగ్రగణ్యుడు మన తెలుగు గడ్డపైనే ఉన్నారని కాంగ్రెస్ నేతలే కాదు.. తెలుగుదేశం నేతలూ చెవులు కొరికేసుకుంటున్నారు. అవినీతి గురించి తెగ నీతులు చెప్పే ఈ ‘తెలుగు’ నేత హఠాత్తుగా మాయమైపోతారని, విదేశాల్లో ‘వ్యవహారా’లను చక్కదిద్దుకున్నాక మళ్లీ ప్రత్యక్షమవుతుంటారని అంటుంటారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. విదేశీ ‘వ్యవహారాలు’ చకచకా చక్కబెట్టుకొచ్చేస్తుంటారు. ఇటు అసెంబ్లీ సమావేశాలయ్యాయో లేదో.. ఆయన మాయం. అదీ ప్రధాన అనుచరులక్కూడా ముందుగా చెప్పకుండా. అవినీతిపై ఆయనసభలో చేసిన తెగావేశపూరిత ప్రసంగం ఇంకా కళ్ల ముందు చెదిరిపోలేదు. అంతలోనే ఎటెళ్లిపోయారు బాబూ!.. అని వారు బురల్రు గోకేసుకుంటున్నారు. ఆయన సింగపూరా.. కాదు కాదు దుబాయ్ .. అబ్బే మాల్దీవులకెళ్లుంటారని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్తున్నారు. ఏదో ఒక దేశం వెళ్తే వెళ్లాడు కానీ, ఇప్పుడే యమర్జంటుగా వెళ్లిపోయేంత పనేం ముంచుకొచ్చిందని..! అందులోనూ.. హవాలా వీరుడు హసన్ అలీ నల్లడబ్బుతో ‘తెలుగు నేతల’కున్న లింకులు బయటపెట్టిన ఈ సమయంలోనా ‘సీక్రెట్’ పర్యటనలు? అందరూ నిజమనేసుకోరూ?.. అని అనుచరగణం తెగ మథనపడిపోతోంది.