4, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీ ఖర నామ శుభాకాంక్షలు.---- మీ నాని

ఇప్పుడు ఉగాది అంతే ఏమిటో తెలుసుకుందాము .వుగా అంతే నక్షత్ర గమనం ప్రారంభమయిన రోజు అంతే సృష్టి ప్రారంభమైన రోజు .సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద వుంటాడు .చంద్ర గమనం కూడా అదే రోజు అశ్విని నక్షత్రం తో ప్రారంభం అవుతుంది .ఈ రెండు కలిసిన రోజే యుగ దినం ప్రారంభం అవుతుంది .యుగం అంతే జంట కాలం భగవంతుని చేతనం కదా .సంవత్షరం వల్లనే సప్త తంతు యజ్ఞం జరుగు తుంది .సూర్య మండలం అనే వినేల్క ఆకాశం నుంచి ఉచ్చారణ లాగా వ్యక్తం చేసే పరా ప్రకృతి ఆవు .సూర్యుడు దాని పొదుగు .సంవత్షరం లోని నాలుగు భాగాలూ దాని స్థానాలు .ఘర్మం అంతే ఎండ వేడి దాని క్షీరం .సంవత్షరం దాని దూడ మేఘాలే వర్షించే ధేనువులు ఆంటే ఆవులు 368 అంగిరసులు అనే dhenuvulu గుంపులై సంవత్షరం అనే దూడ కోసం పాలు ఇస్తాయి ఆంటే ఎండ రూపం లో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయి అని మహా భారతం లో వుంది .సంవత్షరం వయసు గల దూడను బష్కం అంటారుఆంటే సత్యాన్ని సూర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది . .ఈరలర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది అని భావం .అందుకే ఉగాది మహత్తర మయిన రోజు .
ఉగాది నాడు ఏమి చెయ్యాలి ?తలంటి కొత్త బట్టలు మామూలే .ఉగాది పచ్చడి తినాలి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు చెరుకు ముక్కలు మిరియం పొడి పటికబెల్లం సైంధవ లవణం ఆంటే రాక్ సాల్ట్ వెండి గిన్నెలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి తినాలి ఇందులోని ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు వగరు తీపి ఆరోగ్యానికే కాక జీవితంలోని కష్టాలు ,సుఖాలు మొదలయినవి ఉంటాయి జాగ్రత్తగా నడచు కోవాలని అర్ధం .వసంత ఋతువు ప్రరంభామయే రోజు కోయిల పాటలతో మత్తెక్కించి కొసరు రోజు సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు అది వింటే శత్రు సంహారం జరుగుతుందని ,చెడ్డ కలలు రావని,గంగా స్నానం చేసినంత ఫలితం అని గోదానం తో సమాన మని ఆయుర్వృద్ధి కలుగుతుందని సుభకరమని మంచి సంతానము లభిస్తుందని మంచి పనులు చేయటానికి సాధనం అనిపెద్దలు చెప్పారు ఆదాయం యెంత వ్యయం యెంత పూజ్యం యెంత అవమానం యెంత తెలుస్తుంది ప్రమాదాలను హెచ్చరిస్తుంది తప్పుడు మార్గం లోకి జార కుండా కాపాడ్తుంది భవిష్యత్తు పై ఆస కల్గిస్తుంది నిరాశ తాత్కాలికమే నని సూచిస్తుంది కష్టాలను ఎదుర్కోవటానికి ఏమి చెయ్యాలో పంచాంగం చెబుతుంది .
ఈవిదం గా శుభాశుభాలకు చిహ్నమే మన ఉగాది పర్వదినం తెలుగు సంవత్చరాది .ఆంధ్రులకు గొప్ప పండగ .శ్రీ ఖర నామ సంవత్షరం శుభకరం శ్రీకరం సంతోషకరం సౌభాగ్యకరం కావాలనిఆశిస్తూ శుభాకాంక్షలతో సెలవు మీ కాజ చైతన్య

కామెంట్‌లు లేవు: