జాతీయ కాంగ్రెసు పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంతృప్తి మిగిల్చినప్పటికీ కడప ఉప ఎన్నికలు మాత్రం గట్టి దెబ్బ వేశాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడంతో కాంగ్రెసు ఇక రాష్ట్ర కాంగ్రెసు ప్రక్షాళనపై అధిష్ఠానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని అగ్ర నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తోంది. ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవడం అత్యవసరంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి- కొందరు మంత్రుల మధ్య స్పర్థలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం కరవై కిందిస్థాయి శ్రేణులు అయోమయంలో ఉన్న తరుణంలో ఆజాద్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.
రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యడితోపాటు పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం బాధ్యతలు కూడా చూస్తూ వచ్చిన ఆజాద్ అక్కడి ఎన్నికలపై దృష్టిపెట్టి ఇన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం తప్ప ఎలాంటి పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ముందు ప్రధానంగా నాలుగు సవాళ్లున్నాయి. అందులో మొదటిది తమ వర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలున్నట్లు జగన్ వెంట వెళుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరు పార్టీతో ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా వెళతారు, అన్న విషయాలపై ఆయన దృష్టి సారించున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉపసభాపతికి సీఎల్పీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఆజాద్ చర్చించనున్నట్లు తెలిసింది.
ఆ వివరాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతారని, అక్కడ చర్చించాక తదుపరి చర్యలుంటాయని సమాచారం. ముఖ్యమంత్రిని క్రియాశీలం చేయడం
వైయస్ మరణానంతరం పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోటును పూడ్చడానికి కాంగ్రెసు అధిష్ఠానం బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆయన పార్టీలో ధైర్యం నింపే చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పార్టీ నాయకులెవ్వరితో ఆయన కలవలేకపోతున్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే భావన ఎంపీల్లో ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడే చొరవ చూపలేకపోతున్నారని చెబుతున్నారు. కడప ఉప ఎన్నిక సమయంలో ప్రదర్శించిన వైఖరి ఆయనలోని నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపిందంటున్నారు.
ఉప ఎన్నికల అనంతరం ఢిల్లీకొచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద ముఖ్యమంతి శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్ తొలుత ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాల్సి ఉందని ఎంపీలంటున్నారు. ఈ నెల్లోనే పీసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున దానిపై చర్చ జరుగుతుంది. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డి.శ్రీనివాస్ ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నారని, అలాంటి వ్యక్తి పార్టీని ఏం నడుపుతారని సీనియర్ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీశ్రేణులను ఉత్సాహపరచాల్సిన పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ వదిలిపెట్టిపోవడం లేదని, కడప ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా నాయకులంతా తిరిగినా డీఎస్ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని ఉదహరిస్తున్నారు.
డిఎస్ వ్యవహారశైలి నచ్చని తెలంగాణ ఎంపీలంతా మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ పేరును ఆ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం కాంగ్రెసుకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ అంశంపై ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం మనసులో మాటేంటో కచ్చితంగా చెబితే దానికనుగుణంగా నడుచుకోవడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. సోనియాతో భేటీ ఆజాద్ శనివారం ఉదయం 10-జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిసి రాష్ట్ర పర్యటనపై చర్చించారు. హైదరాబాద్ పర్యటనలో కచ్చితంగా తెలంగాణ అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపై ఏం చెప్పాలన్నదానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక తదితర అంశాల గురించి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆజాద్ సమీక్షించనున్నారు.జాతీయ కాంగ్రెసు పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంతృప్తి మిగిల్చినప్పటికీ కడప ఉప ఎన్నికలు మాత్రం గట్టి దెబ్బ వేశాయి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడంతో కాంగ్రెసు ఇక రాష్ట్ర కాంగ్రెసు ప్రక్షాళనపై అధిష్ఠానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని అగ్ర నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తోంది. ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవడం అత్యవసరంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి- కొందరు మంత్రుల మధ్య స్పర్థలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం కరవై కిందిస్థాయి శ్రేణులు అయోమయంలో ఉన్న తరుణంలో ఆజాద్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.
రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యడితోపాటు పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం బాధ్యతలు కూడా చూస్తూ వచ్చిన ఆజాద్ అక్కడి ఎన్నికలపై దృష్టిపెట్టి ఇన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం తప్ప ఎలాంటి పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ముందు ప్రధానంగా నాలుగు సవాళ్లున్నాయి. అందులో మొదటిది తమ వర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలున్నట్లు జగన్ వెంట వెళుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరు పార్టీతో ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా వెళతారు, అన్న విషయాలపై ఆయన దృష్టి సారించున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉపసభాపతికి సీఎల్పీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఆజాద్ చర్చించనున్నట్లు తెలిసింది.
ఆ వివరాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతారని, అక్కడ చర్చించాక తదుపరి చర్యలుంటాయని సమాచారం. ముఖ్యమంత్రిని క్రియాశీలం చేయడం
వైయస్ మరణానంతరం పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోటును పూడ్చడానికి కాంగ్రెసు అధిష్ఠానం బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆయన పార్టీలో ధైర్యం నింపే చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పార్టీ నాయకులెవ్వరితో ఆయన కలవలేకపోతున్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే భావన ఎంపీల్లో ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడే చొరవ చూపలేకపోతున్నారని చెబుతున్నారు. కడప ఉప ఎన్నిక సమయంలో ప్రదర్శించిన వైఖరి ఆయనలోని నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపిందంటున్నారు.
ఉప ఎన్నికల అనంతరం ఢిల్లీకొచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద ముఖ్యమంతి శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్ తొలుత ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాల్సి ఉందని ఎంపీలంటున్నారు. ఈ నెల్లోనే పీసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున దానిపై చర్చ జరుగుతుంది. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డి.శ్రీనివాస్ ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నారని, అలాంటి వ్యక్తి పార్టీని ఏం నడుపుతారని సీనియర్ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీశ్రేణులను ఉత్సాహపరచాల్సిన పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ వదిలిపెట్టిపోవడం లేదని, కడప ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా నాయకులంతా తిరిగినా డీఎస్ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని ఉదహరిస్తున్నారు.
డిఎస్ వ్యవహారశైలి నచ్చని తెలంగాణ ఎంపీలంతా మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ పేరును ఆ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం కాంగ్రెసుకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ అంశంపై ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం మనసులో మాటేంటో కచ్చితంగా చెబితే దానికనుగుణంగా నడుచుకోవడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. సోనియాతో భేటీ ఆజాద్ శనివారం ఉదయం 10-జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిసి రాష్ట్ర పర్యటనపై చర్చించారు. హైదరాబాద్ పర్యటనలో కచ్చితంగా తెలంగాణ అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపై ఏం చెప్పాలన్నదానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక తదితర అంశాల గురించి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆజాద్ సమీక్షించనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి