చిరంజీవి ఆంధ్రదేశంలో మెగాస్టార్, విజయ్ కాంత్ తమిళంలో సూపర్ స్టార్. రాజకీయాల్లో ఇద్దరిదీ ఒకే పరిస్థితి. విజయ్‌కాంత్ ఐదేళ్ల క్రితం పార్టీ పెట్టి తానొక్కడే గెలిచాడు. మెగాస్టార్ మూడేళ్ల క్రితం పార్టీ పెట్టి శాసనసభలో 18 సీట్లు గెలుచుకున్నాడు. ఈ లెక్కన విజయ్‌కాంత్ కన్నా చిరంజీవి మెరుగ్గా కనిపిస్తారు. కానీ పార్టీని నిలబెట్టే విషయంలో, రాజకీయాలను ముందుకు నడిపిస్తూ తాను పుంజుకునే వ్యూహంలో విజయ్‌కాంత్‌నే గొప్పగా చెప్పాల్సి ఉంటుంది.
ఒక్క సీటు గెలిచినా ఏ మాత్రం నిరాశపడకుండా తన పార్టీ డిఎండికెను ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో అన్నాడియంకెతో పొత్తు పెట్టుకుని 41 సీట్లకు పోటీ చేసి 29 సీట్లు గెలుచుకున్నాడు. చిరంజీవి మాత్రం పార్టీని నడిపించలేక కాంగ్రెసులో విలీనం చేయడానికి పూనుకున్నారు. ఈ విషయంలో విజయ్ కాంత్‌ను చిరంజీవి కన్నా బెట్టర్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల్లో ఓ ప్రాంతీయ పార్టీని దెబ్బ తీస్తే తన మనుగడ సాధ్యమని గ్రహించిన విజయ్ కాంత్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధ పడ్డారు. ప్రభుత్వంలో చేరాలని అన్నాడియంకె నేత జయలలిత ఆఫర్‌ను తోసిపుచ్చారు. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెకు కేవలం 23 సీట్లే దక్కడంతో విజయ్‌కాంత్‌కు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి వీలవుతతుందనేది విజయ్ కాంత్ అభిప్రాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
చక్కగా రాసారు. నాయకత్వ లక్షణం వాళ్ళిద్దరి మధ్యా ఉన్న తేడా.
Good move by Vijayakaant. Chirajeevi is a over greedy businessman.
కామెంట్‌ను పోస్ట్ చేయండి