బాబాయ్ బాలకృష్ణకు, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లే భావిస్తున్నాయి. సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా బాలయ్యకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. బాలయ్యను పక్కన పెట్టి ఆయన తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో రాజకీయ వ్యూహ రచనకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు దక్కకుండా అడ్డు పడడమే ప్రస్తుతం నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న వ్యూహమని అంటున్నారు.
నారా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే స్థితిలో బాలకృష్ణ లేరనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారు. గతంలో బాలకృష్ణ చేసిన ఓ వ్యాఖ్యపై కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఓ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. అయితే, ఆ పాత్ర నుంచి బాలయ్యను తప్పించి హరికృష్ణ నటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరులో నందమూరి కుటుంబ సభ్యులు రెండుగా చీలిపోయినట్లు సమాచారం. ఈ చీలికలో బాలకృష్ణ చంద్రబాబు వైపు ఉండగా, చంద్రబాబుపై పోరుకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సిద్దపడినట్లు చెబుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి