8, జూన్ 2011, బుధవారం

ఈ సీజన్‌లో బెస్ట్

ఎండలు తగ్గాయ్. చిరుజల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా సీజన్ మారేసరికి మన శరీరం వెంటనే అడ్జస్ట్ కాలేదు. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.

* శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాధినిరోధక సామర్థ్యం బావుండాలి. ఇది మనం తీసుకునే ఆహారం నుంచే డెవలప్ అవుతుంది.
* ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
* ఎండాకాలంలో చల్లదనాన్ని పెంచే నిమ్మ చల్లని వాతవరణంలో తీసుకోవద్దని అనుకుంటారు. దానివల్ల జలుబు చేస్తుందన్న అపోహ కూడా చాలామందిలో ఉంది.

నిజానికి నిమ్మ వల్ల శరీరం చైతన్యవంతం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి కూడా.

కామెంట్‌లు లేవు: