3, మార్చి 2011, గురువారం

అంతా లొల్లియ(మేము అందరము ఒక్కటే)

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెక్ పెట్టే యోచన చేస్తున్నాయి. వైయస్ జగన్ వర్గం కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది. ఈ స్థితిలో ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, కాంగ్రెసు నాయకుడు తులసి రెడ్డి కలిసి తెలుగుదేశం పార్టీలతో సయోధ్యకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం నాయకుడు పాలకొండ రాయుడితో, మదన్మోహన్ రెడ్డి, పుత్తా నర్సింహారెడ్డిలతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి కూడా వైయస్ జగన్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెసుకు సహకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించేందుకు పోటీకి దిగకూడదని తెలుగుదేశం నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువు మిత్రుడనే నీతిని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించే అవకాశం ఉంది. కాంగ్రెసు తన అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

కామెంట్‌లు లేవు: