7, డిసెంబర్ 2007, శుక్రవారం

ఓ ప్రియురాల

కన్నీళ్లతో గుండె నిండిపోతేవేరే దారి లేక అవికళ్లలోనుంచి దొర్లిపోతుంటాయ్యెన్ని యంత్రాలేసి తోడినాఊట బావిలా అలా..యేడ్చి యేడ్చి వెక్కిళ్లాగిపొయాయ్యిప్పుడు మిగిలింది ఒక్కటేశ్వాస..తెగిపొతుంటే అతుకుబెట్టుకుంటూ పడమటి సంధ్యను వెతుక్కుంటూ..అప్పుడే నా కలం దారి మళ్లి కవిత్వంలొ దిగబడుతుంది పెకిలించినా కొద్దీ పుంఖాను పుంఖాలుగా అక్షరాలు వర్ణ వర్ణ చిత్రాలుడాఫొడిల్స్ గురించి రాద్దామనుకుంటానా !పదాలన్నీ ఎడారుల గుండా ప్రవహిస్తాయ్ నయాగర జలపాతాల గురించి ఆలోచిద్దామనుకుంటానా!అక్షరాలన్నీ కన్నీళ్ల జడివానలో తడుస్తాయ్ ఆ క్షణం నా చెక్కిలిపై వేల వేల కన్నీటి చారికలు సారీ ..అవి నాకు మాత్రమే అర్ధమయ్యే లిపి రహస్యాలు

నీ జ్ఞాపకార్థం మరో తాజ్ మహల్ నిర్మించి నీకు కానుకగా సమర్పించే స్తోమత నాకు లేదుబస్టాపుల్లో నిల్చున్న అమ్మాయిల్నిపలకరించే మనస్తత్వం కాదునాది .

కామెంట్‌లు లేవు: