7, డిసెంబర్ 2007, శుక్రవారం
ఓటమి గురించి
ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమిఎప్పుడూ వదులుకోవద్దు రా ఓరిమివిశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించ వద్దు నిర్ణయంఅప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమీ.....నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేను రా సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేను రాపశ్చిమాన పొంచివుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా గుటక పడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటు తూరుపింట తేలుతుంది రా నిశావిలాసమెంత సేపు రా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదెను రా ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమీ.....నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపొతే నిముషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా దేహముది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారథౌను రా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటురాఎప్పుడూ ఒప్పుకోవద్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి