7, జూన్ 2010, సోమవారం

హాస్యలాపన

ఒకరోజు లింగం మావ లైబ్రరీకి వెళ్లి..

"ఏమిటి సార్ ఇది. వారం రోజుల క్రింద నేను తీసికెళ్ళిన పుస్తకం ఎంత చదివినా పూర్తి కాదు, కథ అర్ధం కాదు. అందులో వేళ , లక్షల పాత్రలు. పైగా విచిత్రం ఏంటంటే అందులో ప్రతి పాత్ర పక్కన ఒక ఫోన్ నంబర్. అలా ఎందుకున్నట్టు. కాస్త చెప్తారు?"

"దేవుడా !! వారం రోజుల నుండి టెలిఫోన్ డైరెక్టరీ కనపడక చస్తున్నా.. నువ్వు తీసికెళ్ళావా తండ్రీ?"

.................................................................................................................................................

ఒక వ్యక్తి హత్య చేసినందుకు మరణ శిక్ష పడింది. అతడిని విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టి శిక్ష వేయాలని తీర్పు ఇచ్చారు.

ఆ రోజు రానే వచ్చింది. ఖైదీని మరణ శిక్ష కోసం తయారు చేసారు.

కరెంట్ స్విచ్చివేసేముందు

"నీ చివరి కోరిక ఏదైనా ఉందా?"
" తీరుస్తారా సార్?"
"ప్రయత్నిస్తాము. ఏంటది చెప్పు"
"నాకు చాల భయంగా ఉంది. ధైర్యంగా ఉంటుంది కాస్త నా చేయి పట్టుకోండి"
"???????"

......................................................................................................................
అది ఒక ఆఫీసులో లంచ్ టైమ్. కామేశం, వీరేశం, గిరీశం ముగ్గురు తమ తమ లంచ్ బాక్స్ లు తీసారు.

కామేశం : " ఉప్మా!!!.. రోజు ఉప్మా తినలేక చచ్చిపోతున్నా. రేపు కూడా నా లంచ్ బాక్స్ లో ఉప్మా పంపితే చచ్చిపోతానంతే.

వీరేశం : " చపాతీలు!!!..రోజు ఈ చపాతీలు తిని తిని విసుగెత్తింది. రేపు కూడా నాకు చపాతీలు పంపితే నేనూ చచ్చిపోతాను. బ్రతికి లాభంలేదు..

గిరీశం : " పులిహోర!!!.. రోజు ఈ నిమ్మకాయ పులిహోర తిని తిని ప్రాణం మీది తీపి చచ్చిపోయింది. రేపు కూడా నాకు పులిహోర పంపితే నేను బ్రతకనంతే."

మరుసటి రోజు ముగ్గురికీ అవే లంచ్ బాక్స్ లు వచ్చాయి. దానితో ముగ్గురూ ఆఫీసు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురి భార్యలు వచ్చారు.

కామేశం భార్య : "ఏవండి. వెదవది ఉప్మా కోసం ప్రాణంతీసుకున్నారా ? ఒక్క మాట చేప్తే వేరే చేసేదాని కదా" అని ఏడుస్తుంది.

వీరేశం భార్య : "ఏవండి.. చపాతీలు ఇష్టం లేదని ఒక్క మాట అంటే వేరే ఏదైనా చేసి పంపేదాన్ని కదా . ఇంత దానికే ఆత్మహత్య చేసుకున్నారా ?" అని ఏడుస్తుంది.

గిరీశం భార్య మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలా కూర్చుంది.

ఆఫీసు వాళ్ళు వచ్చి "ఏంటమ్మా ! మీ భర్త చనిపోతే ఎటువంటి బాధలేకుండా అలా కూర్చున్నావు?"

గిరీశం భార్య " ఈ నా కొడుకు! రోజు తనే వంట చేస్తాడు కదా ! రోజొక వంట చేయొచ్చుగా. రోజు పులిహోర ఎవడు తెచ్చుకొమ్మన్నాడు. దొంగ సచ్చినోడు. అనవసరంగా నన్ను ఇరికించాడు."
-------------------------------------------------------------------------------------------