4, మార్చి 2011, శుక్రవారం

సమాజంలో విష బీజాలు నాటడం మొదలుపెట్టిన రియాల్టీ షోలు

ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్‌పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.

ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్‌నర్‌గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.

లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్‌ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!

ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్‌లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత.

2 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

రెండో రియాలిటీ షో బాగానే వుంది కదా

కాజ చైతన్య చెప్పారు...

బాగానే ఉంది కాని కొన్ని రోజులకు ఆదికూడ నాశనము చేసారు.