6, మార్చి 2011, ఆదివారం
ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి.
పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా? వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు. పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు. ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి పాడె కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి