ఎందఱో ఎందరెందఱో
వెఱ్ఱిగా నమ్ముకొన్న
భూమాతనే
తీరాలను కూడా వదలకుండా
పణంగా పెట్టి
ఆడిన క్రీడలో
గెలిచిన బహుమతులతో
తమ ధనాగారం నింపుకొని
ఇంకా తీరని దాహంతో
తప్పుడు సాక్ష్యంతో
కట్టు కథలు వల్లిస్తూ
సభా సంఘం అంటూనే
పెద్దలందరూ ఫిక్స్ అయిపోయారని
పెడబొబ్బలు పోతుండడం చూస్తుంటే
తెలు కుట్టిన దొంగ తెగించి
దొంగ భుజాలు తడుముకోవడం అన్నది పాతది అన్నట్టు
ఎదుటి వాళ్ళూ దొంగలే అని చేసే ఎదురు దాడి చూస్తుంటే
పాపం పక్వానికి వచ్చినట్టు కనిపిస్తోంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి