ఆపద్బాంధవుడు చిరంజీవి జాక్‌పాట్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కయ్యానికి కాలు దువ్వుతూ ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆదుకున్న చిరంజీవికి పార్టీ ఉన్నత స్థానం కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారట. పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి చిరంజీవిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.
నిజానికి, పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆలోచించారు. అయితే, కొత్తగా వచ్చిన నాయకుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే సీనియర్లు అసంతృప్తికి గురి కావచ్చుననే ఉద్దేశంతో దొడ్డి దారిలో రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను ఆయన చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిడబ్ల్యుసి సభ్యుడిగా చిరంజీవి రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి