పంచ కట్టాడు
ప్రతిపక్షంగా విశ్వాస పరీక్ష పెట్టిస్తా అని అంటున్నాడు
ఒక్క ఎం ఎల్ ఏ తో ఉన్నాయన
మాజిక్ ఫిగరు కన్నా ఎక్కువ
బలముందని దింపే వరకు
మడమ తిప్పేది లేదు అని అంటున్నాడు
గతంలో పంచలూడ గొట్టండి అని అన్నా
ఇప్పుడు నాలుక కరుచుకొని
పడగొడితే నిలబెడుతా అని అంటున్నాడు మరొకాయన
వేర్పాటు వాద పార్టీ
అవిశ్వాసం పెట్టండి
మేము మద్దతు ఇస్తాము అని అంటున్నారు
నిజ్జంగా విశ్వాస పరీక్ష జరిగి
ప్రభుత్వం పడితే వెంటనే ఏమౌతుంది
పడక పొతే ఏమౌతుంది?
రైతుల కష్టాల పేరుతో పెట్టే పరీక్షా ఫలితం
గోనే పట్టలు సిద్దం చేస్తుందా?
కరిచే కుక్కలను కరవకుండా చేస్తుందా?
టీ ఆర్ పీ రేటింగుల కోసం
ఉపయోగించబడే కుక్కల గోల తప్ప.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి