3, జూన్ 2011, శుక్రవారం

ఆ అరవోడు ఎవరు

ఆ అరవోడు ఎవరు మాకు చెప్పడానికి
అని మన రాష్ట్ర పార్టీలు అరిచి చెప్పినా
అన్నీ తెలిసిన ఆయన గారు మాత్రం
తెలంగాణా పై తన గానాన్ని వినిపిస్తూ
అన్ని పార్టీలు ఒప్పుకొంటే
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి
ఏకాభిప్రాయానికి కృషి చేసి
తెలంగాణా పై తేల్చేస్తామని
మరో సారి మన తెలంగాణా వాదులను
తెల్లబోయేట్టు చేసారు.

అవతల తెలంగాణా ఆచార్యులు మాత్రం
కారు అద్దాలు దించకుండా ప్రయాణిస్తూ
కమలం కనిపిస్తే మాత్రం కరచాలనం చేసి వస్తున్నారు.

జెండాలన్నీ పక్కన బెట్టి
అందరినీ కలుపుకుని
ఉద్యమించే విషయంలో
ఎవరూ ఎలాంటి చొరవా చూపించక పోవడం చూస్తుంటే
ఎవరికీ తెలంగాణా రావడం ఇష్టం లేనట్టు ఉంది.

ఉస్మానియా విద్యార్థుల జాక్ కూడా
హైజాక్ కాబడినట్లే కనిపిస్తోంది.
వాళ్ళు కూడా ఈ విషయంలో
వింతగా ప్రవర్తిస్తున్నారు.

మొత్తానికి అందరూ కలిసి
ఆశలు పెట్టుకొన్న
అమాయక జీవికి
తమకు తెలంగాణా దక్కదు
కానీ మేమూ పోరాడాము అని
చెప్పుకొనే దిశ గా
ఉద్యమం దిక్కులు చూసేలా చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: