4, నవంబర్ 2011, శుక్రవారం

ఈ రోజు దొడ్డి దారిలో సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

నాన్న జమానాలో
వాయు వేగంతో వ్యాపారవేత్త అయిపోయి
నాన్న పోతూనే
అదే వేగంతో పాలక పగ్గాలు కావాలని
వేసిన పాచికలు పారక
తిరగబడితే

పరిస్థితులు ఎదురు తిరగబడి
వాయు వేగపు సంపాదనలో
ముద్దాయిగా ఆరోపణలు ముసురుకొని
దానిపై విచారణ ఒకింత నెమ్మదిగా పోతోంది

ఇంకో ఘనుల గాలి వాటపు సంపాదనలోని
వాటా లు
ఈ వాయు వేగపు సంపాదనకు
తోడయ్యాయేమో
అనే అనుమానంతో పిలిపిస్తే
లేదు నన్ను పిలిచింది సాక్షిగా నే
అని సంబరపడిపోవడం చూస్తుంటే
చిన్నపిల్లాడి మనస్తత్వం గోచరిస్తోంది

అక్కడ అడిగిన ప్రశ్నలు ఏవో చెప్పక
నాన్న ఇచ్చిన సహకారంతో
రెచ్చిపోయి మరో కేసు విషయమై బోనులో ఉన్న
కోనేరు కు మొదటి స్నేహితుడు
బాబే ఆయననూ పిలవండి పేరంటానికి అని
పెంకి దాడులు మొదలెట్టడం విచిత్రమే

ఒక వేళ బాబు తన జమానాలో పిలిచినా
తరువాత ప్రభువుగా ఉన్న నాన్న
నానా గడ్డి కరుస్తున్న కోనేరు ను ఆపక
ఆయన వేసిన గడ్డిని తిన్నాడా?
అనే విషయం పై సాక్షికి నోరు పెగలదు ఎందుకో?
ఎదుటోడికి నైతిక విలువలు చెప్పే ముందు
తను ఏ తానులో ఉన్నాడో రుజువు చేసుకోవాలి కదా?

మాట్టాడితే మడమ తిప్పను అని
మతిలేని మాటలు చెబుతారు
ఈ రోజు దొడ్డి దారిలో
సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

కామెంట్‌లు లేవు: