కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఏం చేయాలో తెలియక చిరంజీవి దిగి వస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో ఆయన బుధవారం మాట్లాడిన మాటలు ఆ అనుమానాలకు తావిస్తున్నాయి. తనకు ఎప్పుడు పదవి ఇస్తారో, ఎంత వరకు తాను వేచి ఉండాలో తెలియక చిరంజీవి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ మంత్రి పదవి ఇస్తే చాలునని, పదవి ఏదైనా ఉంటే సేవ చేయడానికి ఓ ఆదరవు దొరుకుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తనను ఇలా నిరీక్షణలో పెట్టకుండా ఏదైనా పదవి ఇవ్వాలనే విజ్ఞప్తి ఆ ప్రకటనలో ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాజకీయాల్లోకి దిగి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కాంగ్రెసులో చేరిన తర్వాత రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా సంతృప్తి పడే స్థితికి వచ్చారని అంటున్నారు.
కాగా, అనూహ్యంగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కాంగ్రెసు అధిష్టానం తెర మీదికి తేవడంతో చిరంజీవిలో ఆందోళన ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తనకు దక్కాల్సిన హోదా, పదవి శ్రీనివాస్ ఎగరేసుకు పోతారని చిరంజీవి ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తనకు ఏ పదవి ఇచ్చిన ప్రస్తుతానికి సంతృప్తి చెందాలనే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తీవ్రమైన అనిశ్చితికి చేరుకోవడంతో కూడా చిరంజీవికి బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తోందనే మాట వినిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఇంత బువ్వుంటెయ్యమ్మో అన్నట్టు అనిపిస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి