వృద్దుల చే సుద్దులు చెప్పించుకోవాల్సిన
భావి తరం ఎండమావుల వెంట వెళ్ళిపోగా
పండిన వృద్దులే ఇప్పుడు దాని సంతోషం
గో ధూళిని లేపే వారు లేరు
పాలిచ్చే ఆవులను మాత్రం ఆశగా చూసుకొనే వారు మాత్రం
అక్కడక్కడా అగుపిస్తుంటే
కూలీలు దొరక్క
కరెంటు తో దాగుడు మూతలు ఆడలేక
గిట్టు బాటు గాక
ప్రతిసారి అదృష్టం పరీక్షించుకోలేక
సరైన పోషకాహారం దొరక్క
నీరసపడి
బీడుల చూస్తూ
అందులో పూర్వం పండించిన బంగారాన్ని తలచుకొని
నెమరేసుకొంటూ
ఇవి ఇలాగే ఉంటే
భావి తరాలు ఏమి తిని బతుకుతారో
అని బాధ పడుతూ
ఆశలు రేపిన
జల యజ్ఞం
జనాల స్వేదం
ధనంగా
పాలకుల పంటలు పండిస్తుంటే
పల్లె లో మొలకెత్తే ఆశలు కూడా
అక్కడే అడుగంటి పోతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి