23, ఫిబ్రవరి 2011, బుధవారం

స్వతంత్రతంటే తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!

1) ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

ప్రజధనం కొల్లగోట్టే ముఠాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

అతివినయం చూపించే రాబంధులు,
పదవీ నియామకం కోసమేగా ఈ పకడ్బందీలు.

రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.

పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.

మార్పుకోసమే ఎదురుచూసే పిచ్చిజనాలు,
ఏనాటికి జరగదదని తెలుసుకోలేరు పచ్చినిజాలు.
2) నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,
మనుషులని చంపటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మానవత్వం,
ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
మా దేశం నేర్పిన పాఠం ఇదే, మా మనుషులు నడిచే బాట ఇదే?!

ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,
ఇదే మేము నేర్చుకున్న మానవత్వం, మా నవతకు నేర్పుతున్న మా'నవత్వం'?!

3) బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం!
మానవతను వదిలేద్దాం.....
బ్రతుకు హీనమైపోతున్నా, భవిత పాడైపోతున్నా,
ప్రజలు చచ్చిపోతున్నా,ప్రగతి పతనమవుతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

రాష్ట్రం రగిలిపోతున్నా, బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా, ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

సిగ్గులేక బ్రతుకేద్దాం, గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం,
మార్పు రాలేదని బాధపడదాం, ఎదుటివారి మీద నిందలేద్దాం,
మనం మాత్రం మారక్కర్లేదని సరిపెట్టుకుందాం!

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతుకీడుస్తూ బ్రతికేద్దాం,
స్వతంత్రమంటే ఏంటో తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!!

కామెంట్‌లు లేవు: