12, మార్చి 2011, శనివారం

ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!

""తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"".

కొందరి దూషణలతో,మరికొందరి భాషణలతో,కొందరి చేష్టలతో,మరికొందరి నిశ్చేష్టలతో,కొందరి ఉద్యమాలతో,మరికొందరి మాధ్యమాలతో
కొందరి విధ్వంసంతో,మరి కొందరి ఉత్సాహం తో విసిగి వేసారి పోయాను,మార్పంటే ఏమిటో మర్చిపోయాను.నాకు నేనే మారిపోయాను.ఇన్నాళ్ళుగా అడ్డొచ్చిన సహనం నిన్నటితో చచ్చిపోయింది,ఎవరు తనో,ఎవరు పరో నిన్నటి తో తెలిసిపోయింది.
ఉందనుకున్న సౌభ్రాతృత్వం లేదని తేలిపోయింది.మనుషులే పోయాకా విగ్రహాలెందుకట,ఉద్యమాల పేరుతో పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నప్పుడే అడగనోల్లు, బోడి బొమ్మలు నేలకూలితే లొల్లి చేస్తరేమంటుండ్రు.

కామెంట్‌లు లేవు: