జపాన్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. ప్రమాదకరమైన సునామీ కూడా తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తాకిడికి పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. అయితే మరణాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని మియాగి భూకంపానికి గురైంది. ఆ ప్రాంతాన్ని వరదలు ముంచేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి.
ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. వచ్చే వారం ఇంకా ఓ భయంకరమైన విధ్వంసం జరగనుందని లండన్‌లో ఉన్నటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు దీనికి అంతటికి కారణం 'సూపర్ మూన్' అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ మూన్ అంటే ఏమి లేదండీ..20 సంవత్సరాల క్రితం మూన్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, ఇది మాత్రమే కాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై లావా భూమిమీద పారుతుందని అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా నాచురల్ శాటిలైట్ అయినటువంటి భూమికి దగ్గరగా ఈ సూపర్ మూన్ రావడమే ఇందుకు కారణం అంటున్నారు. మార్చి 19వ తారీఖున సూపర్ మూన్ భూమికి అత్యంత సమీపం అంటే దాదాపు 221, 556 మైళ్శ దూరంలో వస్తుందని అంటున్నారు. గత 20 సంవత్సరాలలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నారు. గతంలో ఇలాగే సూపర్ మూన్ భూమికి దగ్గరగా 1955, 1974, 1992, 2005లో రావడం జరిగింది. దాంతో ఆయా సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు సంభవించాయి.
ఇది ఇలా ఉండగా ప్రముఖ టివి వాతావరణ నిపుణలు జాన్ కెట్ట్‌లీ మాత్రం భూకంపాలు, సునామీ లాంటివి జరగడానికి సూపర్ మూన్ ఏమి కారణం కాదని తన వాదనని వినిపిస్తున్నారు. ఐతే భూమికి సూపర్ మూన్ ఇలా దగ్గరకి వస్తే మాత్రం సముద్రంలో అలలు పోంగుతాయని అన్నారు. ఇలాంటి సందర్బాలలో ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందని అన్నారు. జపాన్ భూకంపం కారణంగా న్యూజిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పేన్స్, న్యూ గునియా, హావాయి తదితర ప్రాంతాలలో మరి కొద్ది గంటలపాటు అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి