ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అద్భుతాలకు ఈ సంఘటన ఓ నిలువెత్తు నిదర్శనం.
చూడటానికి అదో పాత కారే కావచ్చు, కానీ ఆ కారు యజమాని మాత్రం ప్రత్యకమైన వారు. 1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు రిజిస్ట్రేన్ నంబర్ కూడా విశిష్టమైనదే - ‘DNA 8888’. ఈ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే. బాబా సర్గస్తులైన తర్వాత అతనితో తమకు ఉన్న అనుంబంధాలను, అనుభవాలను కోట్లాది మంది అభిమానులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సత్య సాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
నెమలి వర్ణంలో ఉండే ఈ రాయల్ కారు బాంద్రాకు చెందిన ఇర్ఫాన్ మొఘల్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా టెక్ (ఓ హై-ప్రొఫైల్ కార్ మెకానిక్) యజమాని అయిన ఇర్ఫాన్ ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా, 1972లో బాబా ఈ కారును కౌలాలంపూర్ నుంచి తెప్పించారు. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా, ప్రశాంతి నిలయానిక చెందిన అతని స్కూల్ పేరు "శ్రీ సత్య సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్"తో రిజిస్టర్ అయ్యింది. తర్వాతి కాలంలో ఆ కారును ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త వివేక్ బర్మన్‌కు 1984లో అమ్మేశారు. ఆ తర్వాత 1996లో మా నాన్నగారు అమన్ మొఘల్ ఈ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుండి అది మాతోనే ఉంది" అని చెప్పారు.
ఇంకా.. "ఈ కారును మేం కొనేటప్పుడు వాళ్లు చెప్పిన ధరకు కొనేందుకు అంగీకరించలేదు. కానీ ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా అని తెలియడంతో తర్వాత ఆయన అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు" అని ఇర్ఫాన్ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కారును తెచ్చినపుడు దీని రిజిస్ట్రేషన్ నంబర్ వేరుగా ఉన్నది. "ఈ కారు మొదటి నంబర్ ADA 9, కానీ తర్వాత ఈ కారు సత్య సాయి ఇన్సిట్యూట్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తర్వాత ‘DNA 8888’గా మారిపోయింది.
అయితే.. ఈ కారు గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మా వ్యాపారానికి ఎంతో కలిసి వచ్చింది. దీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా వ్యాపారం అంచెలంచెలు ఎదిగింది. బాబా రోజూ కూర్చుని తిరిగే ఈ రోల్స్ రాయిస్ శాలూన్ యజమానిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. బాబా జ్ఞాపకంగా ఈ కారు ఎప్పటికీ తమతోనే ఉంటుందని ఇర్ఫాన్ చెప్పారు. బాబా మృతి పట్ల ఇర్ఫాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి