సత్య సాయిబాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా షిర్డీ సంస్థాన్ అంగీకరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తాను షిర్డీ సాయిబాబా వారసుడినని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తులు కూడా అలాగే భావిస్తారు. కానీ షిర్డీ సంస్థాన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబాను షిర్డీ సాయి బాబా వారసుడిగా అంగీకరించేందుకు షిర్డీ సంస్థాన్ సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉన్నది.
నిజానికి, షిర్డీ సాయిబాబా అశేష భక్త జనానికి ఆకర్షణగా నిలిచింది. షిర్డీ సాయి బోధనలు విశేష ప్రచారం పొందాయి. సత్య సాయిబాబాకు కూడా భక్తజన సందోహానికి తక్కువేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబా విశేష జనాదరణ పొందారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.
సత్య సాయి ఎంతగా జనాదరణ పొందినప్పటికీ, భక్తులు ఆశిస్తున్నప్పటికీ షిర్డీ సంస్థాన్ సత్య సాయి బాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధంగా లేదు. రెండు ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేసే ఆలోచన కూడా ఆ సంస్థాన్‌కు ఉన్నట్లు లేదు. జీవించి ఉన్న కాలంలో సత్య సాయిబాబా షిర్డీకి వెళ్లిన దాఖలాలు కూడా లేవంటారు. పైగా, షిర్డీ సంస్థాన్ షిర్డీ సాయిబాబాకు వారసులు ఎవరూ లేరంటూ బోర్డు కూడా పెట్టుకుంది.
తనకు మూడు జన్మలున్నాయని, మొదటి జన్మ షిర్డీ సాయిబాబా కాగా రెండో జన్మ సత్య సాయి బాబా అని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. మూడో జన్మలో ప్రేమ సాయిగా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పుడుతానని ఆయన చెప్పారు. మాండ్యా జిల్లాలోని గుణవర్తి లేదా గుణపర్తిలో సత్య సాయి బాబా ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి