ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందారని ట్రస్టు ప్రకటించే అవకాశాలున్నాయని పుకార్లు పుడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నడిచే దేవుడిగా కొలిచే సత్య సాయిబాబా గత నెల 28 తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న సత్యసాయిబ ఉన్నత వైద్య శాస్త్ర సంస్థ వద్దకు పెద్ద యెత్తున భక్తులు చేరుకున్నారు. ఆయనకిప్పుడు 86 ఏళ్లు.
జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధి చెందడం అంటారు. ట్రస్టు వ్యవహారాలపై చర్చించడానికి సత్యసాయి కేంద్ర ట్రస్టు సభ్యులు గురువారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌కూ ఇతర సభ్యులకు మధ్య విభేదాల కారణంగా కూడా ఆ ప్రచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తుండడంపై, బాబాకు అందిస్తున్న వైద్యంపై శ్రీసత్య సాయిబాబా భక్తుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రస్టు సభ్యుల వ్యవహార శైలిపై సంఘం అధ్యక్షుడు ధనంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుట్టపర్తిలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పెద్ద యెత్తున బలగాలను దింపింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి