7, నవంబర్ 2011, సోమవారం

అన్నను చూసి తనే దేవుడని డప్పేసుకొన్నాయనను

గజన్ పై ఆరోపణల గురించి
గంటల కొద్దీ సోదించి
రక్షించినానన్న కిరణ్
కుర్చీ ఎక్కినప్పటి నుండి
ఎవరూ పట్టించుకోవడం లేదు
దించేస్తామనే గజన్ తప్ప.

సభాద్యక్షుడుగా
పాలకుల పాపాలను
కడగనీకుండా
కష్టపడ్డ వ్యక్తి
కొత్తగా మనకు
ఏమి ఒరగబెడుతాడులే అని
నిరూపితమైన నిజం చవిచూసిన
జనం ఒకింత నిరుత్సాహం చూపారు.

పాడెక్కిన పావలాను మరిచిన జనాలకు
పావలా వడ్డీకి కోట్ల కేటాయింపు అన్నాడు
చీమ కుట్టినట్టు కూడా లేదు

లక్షల కొలువులన్నాడు
కొంపదీసి ఇచ్చేస్తాడా ఏమిటి అని
వ్యంగంగా అన్నోడు కూడా
ఆంధ్రా లో కనిపించలేదు

ఆరు నెలలకో పధకం అన్నాడు
ఆరు నెలలైనా కుర్చీలో
ప్రశాంతంగా కూర్చోలేని వాడనుకొని
ప్రజలు పట్టించుకోలేదు

అన్నను చూసి
తనే దేవుడని కొడికి చేత
డప్పేసుకొన్నాయనను
అధిగమించేద్దామని
ఏకంగా
పాడెక్కిన పావలా
అర ప్రాణంతో ఉన్న అర్ధ రూపాయి ని విడిచి
కొనడానికి చెల్లుబాటు కాక
కోమాలో ఉన్న రూపాయికి
కిలో బియ్యం ఇస్తామని
తన ఓట్ల బొచ్చతో
తన బుద్ది చూపాడు.

కామెంట్‌లు లేవు: