9, ఫిబ్రవరి 2011, బుధవారం

వెర్రి బాగుల వాడు

వెనకటికి మా ఊరిలో ఒక సామెత ఉండేది. ఎందుకూ పనికి రాని ఒక వెర్రి బాగుల వాడిని, ఒరేయ్ నీకు పొలం ఎంత ఉందిరా అని అడిగితే, రాజు గారిదీ నాదీ కలిపి నూటఒక్క ఎకరాలు అని చెప్పుకొనేవాడంట. ఇంతకీ అందులో నీది ఎంతరా అని గుచ్చి అడిగితే మాత్రం సిగ్గు పడుతూ ఒక ఎకరం నాది, వంద ఎకరాలు రాజు గరివీ అని ఒప్పుకొనేవాడంట.
కొత్త గా సోనియమ్మ జపం చేస్తున్న మన వెర్రి బాగుల వాడు కూడా, ఇప్పుడు నావీ కాంగ్రెస్ వీ కలిపి నూటా డబ్బయ్యి స్థానాలు అని చెప్పుకొంటున్నాడూ. కలిపి సరే, నీవి సొంతం గా ఎన్ని అని ఎవరన్నా పొరుగు రాష్ట్రం వారు అడిగితే మాత్రం వెకిలి గా నవ్వుతూ పద్దెనిమిదిలో రెండు పోగా పదహారు అని చెప్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషులు పుడతారని ముందే ఊహించి కాబోలు మన పెద్దలు అలాంటి సామెతలు సృష్టించారు.

తిరుపతి లో హోటెల్ గదిని ఏదో దొంగల స్తావారాన్ని వెతికినట్టు వెతికించినది ఈ కాంగ్రెస్ వారే అన్నది గుర్తుందో లేదో ఈ కొత్త బిచ్చగానికి.