9, ఫిబ్రవరి 2011, బుధవారం

అనాధ పిల్లలు వేదన

రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో

అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!


ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే

మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!


మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో

ఒక చుక్క విలువను నాపై కార్చండి!


మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో

మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు

ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !


రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని

తుడిచే పిలగాడినీ నేనే....!


మీ ఎంగిలి ప్లేట్లను కడిగి

మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!


లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య

తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.


ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల

లోకాన ఉమ్మివేయబడ్డాను......


నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదండీ.....!


మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు

ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!


నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో

రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని

ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....


నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....

ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....