కడప ఉప ఎన్నికల సందర్భంగా రామోజీ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తన ఈనాడు దినపత్రికను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ వ్యవహారాలను వెలికి తీసే పని పెట్టుకున్నారు. వైయస్ జగన్ పేరు ప్రస్తావించకుండా ఈనాడు దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ఓ వార్తా కథనాన్ని అందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే శీర్షిక కింద ఎవరి పేరు పెట్టకుండా ఓ వార్తాకథనాన్ని ప్రచురించారు. చదివినవారికి ఆ వార్తాకథనం ఎవరిని ఉద్దేశించి రాశారో వెంటనే అర్థమైపోతుంది. అది తప్పకుండా వైయస్ జగన్‌ను ఉద్దేశించి రాశారనేది వేరుగా చెప్పనక్కర్లేదు.
కడప జిల్లాలో పార్టీ నాయకులను జగన్ వర్గీయులు బెదిరిస్తున్నారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం చెప్పకనే చెబుతోంది. వస్తే మా పార్టీలోకి రండి, వేరే పార్టీల్లోకి వెళ్లొద్దని బెదిరిస్తున్నట్లు ఈనాడు దినపత్రిక రాసింది. ఏజెంట్లుగా కూర్చుంటే మీ సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించింది. కడపలో ఓ పార్టీ నేతలు హల్‌చల్ చేస్తున్నారని రాసింది. దీన్ని బట్టి, రామోజీ రావు పద్ధతి ప్రకారం ఇటువంటి వార్తాకథనాలను కడప ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు తన పత్రికలో రాస్తూ పోతారనేది అర్థమవుతూనే ఉన్నది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి