26, మే 2011, గురువారం

నేనే ఎలికవ్వాలని అనుకొంటే ఎలా కుదురుతుంది.

తానూ ఓ ఏలిక అవ్వాలని
ఓ ఎలుక
తన కుటుంబం మొత్తంతో
ఇంట్లో చిందర వందర చేస్తుంది
అందరూ చూసే లోపల
తన కుటుంబం మొత్తాన్ని
కలుగులో ఉంచుకొంటుంది
చిందర వంద చేస్తున్న భాగాన్ని
తన ఏలుబడికి వదిలేయమని
తతిమా ఎలుకలేవీ అలా సెయ్యకుండా
ఏదన్నా ప్రయత్నించినా
కలుగు దాటి బయటకు వచ్చి
ఇంట్లో ఇంకో మూల చప్పుడు చేసినా
ఎలికవ్వాలని కలలుగనే ఎలుక
చప్పుడు చేసే ఎలుకల కలుగుల ముందర
టమోటో పిండేసి గుడ్ల పెంకులు పెట్టేసి
నా నా రభస చేస్తోంది
అన్ని ఎలుకలూ ఒక్కటై
చెత్త జేస్తే కదా ఈ ఇంట్లో ఉండలేమని
సామాన్లు సర్దుకు పోయేది అక్కడ ఉన్నోళ్ళు.
నచ్చినప్పుడు కలుగు బయట వచ్చి
చిందర వందర చేసి
మిగిలినప్పుడు కలుగులోకి వెళ్లి పోయి కాలాక్షేపం చేస్తూ
నేనే ఎలికవ్వాలని అనుకొంటే
ఎలా కుదురుతుంది.

కామెంట్‌లు లేవు: