అన్నను ఆదర్శంగా తీసుకొని
అబ్దుల్ కలాం పిలుపందుకొని
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
సామాజిక న్యాయాన్ని మంది మదిలో చొప్పించలేక
రెంటికీ చెడ్డ రేవడి అయి
గౌరవ నిష్క్రమణకోసం చూస్తుంటే
కేంద్ర మంత్రి ఇంటికి రాంగానే
తనకో కేంద్ర అమాత్య పదవి వస్తుందేమోనని ఆశపడి
పెట్టే బేడాతో సహా పార్టీని చేతిలో పెట్టడానికి ఒప్పుకొని
చేతి కోసం ఓట్లడిగి
తనూ రాహుల్ గాంధీ లాంటి వాడేనని నిరూపించుకొని
ఒగరుస్తూ ఓపిగ్గా హస్తిన ప్రయాణాలు చేసి
హస్త రేఖలు చూసుకొని మురిసిపోతూ
ప్రజల మధ్య ఉండాలను కొంటున్నానని
సముద్రం (చేతి పార్టీని సముద్రం పార్టీ గా వర్ణిస్తారు రాజకీయ విశ్లేషకులు)
ఒడ్డున నిలుచుకొని కేకేసి చెప్పి
ఇంటికొచ్చి అలక పాన్పు ఎక్కేసాడు
మరో సారి ప్రయాణం కట్టమని హస్తిన నుండి పిలుపొచ్చింది
అమాత్య పదవి కోసం అడిగి మళ్ళీ భంగపడుతాడో ఏమిటో?
ఇక్కడ భంగపడతాడు అని ఖశ్చితంగా ఎందుకు చెబుతున్నాను అంటే
ఈయనకు పదవిచ్చి ఖాళీ అయ్యే తిరుపతి లో
పరపతి నిలుపుకొనే ధైర్యం సముద్రానికి లేదు కాబట్టి
అదీ స్థానిక ఎన్నికల ముందు అసలు ఆ ఊసే ఊహకు కూడా రానివ్వరు.
అందుకే అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షే అవుతుంది
కాదు అమాత్యాడు అవ్వాలని మొండిఘటం అయితే రాష్ట్రం లో ఇస్తారు.
గోనె పట్టలు కూడా రైతులకు ఇవ్వలేని ఘోర ప్రభుత్వంలో
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
రాష్ట్ర మంత్రులలో ఓ బోడి లింగ మవ్వడానికి
మనః సాక్షి అంగీకరిస్తుందా అన్నది ఓ ప్రశ్న?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి