తన కుమారుడు నారా లోకేష్‌కు అడ్డం పడాలని చూస్తున్న తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి కాలం రాజకీయాలపై దృష్టి పెట్టలేని స్థితిని గమనించి ఆయన నారా లోకేష్‌ను పార్టీలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ పాగా వేశారు. ఒకప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి గల్లా అరుణ చేతుల్లోకి పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ తాను పాగా వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో భాగంగా తన కుమారుడు నారా లోకేష్‌ను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్లనే చంద్రగిరి నియోజకవర్గం పార్టీ నేతలు నారా లోకేష్‌ను ఇంచార్జీగా నియమించాలని పట్టుపడుతున్నారు.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతను సినిమాలను తగ్గించుకోవడానికి కనీసం పదేళ్లయినా పడుతోంది. ఈ పదేళ్ల లోపు అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి పార్టీ నాయకత్వం చేపట్టే స్థితి కూడా లేదు. హరికృష్ణకు తగిన సమర్థత కూడా లేదు. పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సాహసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేం. అందువల్ల నారా లోకేష్‌ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవు. వచ్చే పదేళ్ల కాలంలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అనుకునే సరికి నారా లోకేష్ నాయకుడిగా స్థిరపడిపోతారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆటంకాలు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే మాత్రం కాస్తా తేడా రావచ్చు. కానీ, లోకేష్‌ను అల్లుడిగా చేసుకున్న బాలకృష్ణ అందుకు సాహసించకపోవచ్చు. ఇప్పటికే, చంద్రబాబు, బాలకృష్ణల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కుమారుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్ చేసి పెట్టారు. పార్టీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నారా లోకేష్‌ను సమర్థించేవారే. అంటే చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండేవారే. నామా నాగేశ్వర రావువంటి నాయకులు నారా లోకేష్‌కే మద్దతు తెలుపుతారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి