నేను అడిగిందల్లా ఆగమేఘాల మీద అధికారంతో అందించావు
కాలు పెట్టిన చోటల్లా క్రమబద్దీకరించావు
తర తరాలకు మనగలిగేలా పునాదులకు సిమెంట్ ఏసావు
పవరు ప్లాంట్లు ఇచ్చి నిరంతర విద్యుత్తు ఉండేలా చేసావు
గాదెల నిండా నింపుకోడానికి గనులు ఇచ్చావు
ఎవరు నోరేట్టినా తిట్టడానికి పేపర్ పెట్టించావు
మన గురించి స్తుంతిచడానికి ఓ చానల్ పెట్టించావు
మన ఆస్తులు కేసి ఆబగా చూస్తారని
మామ బావలకు సర్వే చేసి మరీ
సరిహద్దుల గొడవ లేకుండా జిల్లాలనే రాసిచ్చావు
ఇంతిచ్చిన నువ్వు అసలైన మంత్ర దండం నీ కుర్చీ
నాకు వచ్చేలా ఏర్పాటు చెయ్యకుండా ఏమారావు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఇదే మొదటిసారి మీ బ్లాగుకు రావటం. చాలా బాగున్నది. దాదాపు మీ పోస్టులన్ని చదివాను. భాష మిద, సాహిత్యం మిద, సమకాలీన రాజకియాలమిద మంచి పట్టు కనపడుతున్నది. ఇతరులనుండి రెస్పాన్స్ కోసం చూడకుండా మంచిమంచి పోస్ట్లు చేస్తున్నారు. ఒక మంచి బ్లాగును ఇన్నాళ్ళు మిస్సయ్యానే అనిపిస్తున్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి