తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటించినవారు ప్రమాదాలకు గురి కావడంతో ఆయనను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. డీహైడ్రేషన్‌తో రజనీకాంత్ గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేరి, అదే రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన ఆస్పత్రిలో చేరి మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. ఈ సమయంలో ఆయన స్వాముల ధ్యాన మందిరానికి ఆశ్రమానికి వెళ్లి గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత కాళికాంబ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. దీంతో రాణా చిత్రానికి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
కాగా, రాణా చిత్రంలో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నారు. అరవై ఏళ్ల వయస్సు పైబడిన రజనీకాంత్ రాణా చిత్రంలో ఓ యువకుడి పాత్ర పోషిస్తున్నారు. దానికోసం ఆయన డైట్ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు 20 రోజులు డైట్ చేయడంతో అది రజనీ ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. దాదాపు 75 కిలోల బరువు ఉన్న రజనీ డైట్‌తో 15 కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా, ఆల్కహాల్ కూడా మానేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. రజనీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
ఇదిలా వుంటే, రజనీని మాత్రం సెంటిమెంట్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రముఖి సినిమాలో నటించడం వల్లనే కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్, నటి సౌందర్య ప్రమాదంలో చనిపోయారనే సెంటిమెంట్ ప్రబలంగా ప్రచారంలో ఉంది. దీని ప్రభావం రజనీకాంత్ మనసుపై పనిచేస్తుందని చెబుతున్నారు. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రజనీకాంత్‌కు అదే ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా, రాణా చిత్రం కథకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తుండడం వల్ల కూడా రజనీకాంత్‌కు కష్టాలు తెచ్చిపెడుతుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. దానివల్ల రాణా చిత్రం ముందుకు సాగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, స్థిరచిత్తం, దృఢసంకల్పం గల రజనీకాంత్ వాటిని అధిగమిస్తారని అశిస్తున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి